Nsnnews// ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టు.. ప్రవేట్ పాఠశాలల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జగ్గు మల్లారెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు చెప్పిన మల్లారెడ్డి…తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాక..మంజీర అక్షర ప్రభ కార్యక్రమాలతో వయోజనులకు విద్య బోధించానట్టు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల సమస్యల గొంతుకను శాసనమండలిలో వినిపించాలన్న ఆశయంతో.. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేసి.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో.. ప్రముఖ చేతివ్రాత నిపుణులు ఎజాస్ అహ్మద్, డీటిఎఫ్ సత్తయ్య, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news