Home బిజినెస్ టాటా మోటార్స్ తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ || Tamil Nadu CM MK Stalin Lays Foundation Stone For Tata Motors’ Manufacturing Plant

టాటా మోటార్స్ తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ || Tamil Nadu CM MK Stalin Lays Foundation Stone For Tata Motors’ Manufacturing Plant

0
టాటా మోటార్స్ తయారీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ || Tamil Nadu CM MK Stalin Lays Foundation Stone For Tata Motors’ Manufacturing Plant

 

Nsnnews// ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ..తమిళనాడులోని పాణపాక్కంలో కొత్త కర్మాగారం నిర్మించనుంది. స్పోర్ట్స్ కార్లు, ఎస్ యూవీల తయారీకి ఉద్దేశించిన ఈ ప్లాంట్ కు.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. సుమారు 9వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్ లో.. టాటా మోటార్స్ , జాగ్వార్ ల్యాండ్ రోవర్ కు చెందిన తదుపరితరం వాహనాలు తయారు చేయనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్ లో తయారైన కార్లను దేశీయంగా విక్రయించడంతో పాటు.. విదేశాలకూ ఎగుమతి చేస్తామని టాటా మోటార్స్ తెలిపింది. దశలవారీగా ఈ కర్మాగారం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. ఏడాదికి 2.50 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో.. దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్లాంట్ వల్ల సుమారు 5వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Latest news,Telugu news,Business news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here