Nsnnews// జీహెచ్ఎంసీలో దారుణంగా పడిపోయిన నిర్మాణ అనుమతుల ఆదాయం.. 2023-24తో పోలిస్తే ఏకంగా రూ.300కోట్లు తగ్గిన ఆదాయం. హైదరాబాద్ – బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తగ్గడంతో.. జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం ఆదాయం గణనీయంగా తగ్గింది. గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీ రుసుము రాబడిలో తగ్గుదల కనిపిస్తోంది.కిందటి సంవత్సరం (2023-24)తో పోలిస్తే ఏకంగా రూ.300 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) కంటే రూ.350 కోట్లకుపైగా ఆదాయం తగ్గడం గమనార్హం. నిర్మాణ అనుమతుల జారీ రుసుమే పట్టణ ప్రణాళికా విభాగానికి ప్రధాన ఆదాయ వనరు. కానీ, ఈ ఏడాది భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా.. ఏప్రిల్ నుంచి అక్టోబరు 20వ తేదీ వరకు రూ.750 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇప్పటి వరకు కేవలం రూ.450 కోట్లు మాత్రమే సమకూరింది.
Latestnews, Telugunews, Telangananews, Hyderabadnews…