Home తెలంగాణ జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు దక్కేనా..? || Will Jeevan Reddy get MLC seat?

జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు దక్కేనా..? || Will Jeevan Reddy get MLC seat?

0
జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు దక్కేనా..? || Will Jeevan Reddy get MLC seat?

 

Nsnnews// రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీనికి తోడు ఆశావాహుల సంఖ్య సైతం భారీగానే ఉంటోంది. తాజాగా.. మరోసారి ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ‌ ఎన్నికల సందడి కనబడుతోంది.

టికెట్‌పై ఆశలు పెట్టుకున్న అశావాహులు ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు రెఢిగా ఉన్నా, టికెట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. దీంతో జీవన్ రెడ్డి కూడా సైలెంట్ ‌అయ్యారట. అధికార పార్టీలో అశావాహుల లిస్ట్ రోజురోజుకి పెరుగుతోంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార పార్టీ.. సిట్టింగ్ ‌స్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పటి నుండే వ్యూహాలు రూపొందిస్తోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చే విషయంలో అధిష్టానం తర్జనభర్జనకు గురి అవుతోంది. ఇప్పటికే అధిష్టానం తీరుపై జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో గతంలోనే అలకబూనారు. అయితే రేవంత్ ప్రభుత్వంలో కేబినెట్ స్థాయి పదవి వస్తుందని అశపడ్డారు. కానీ ఎలాంటి పదవి రాలేదు. కనీసం మరోమారు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని గ్యారంటీ లేదు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టిందట. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. బీఅర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పొటీ ఇవ్వగా.. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పైచేయి సాధించింది. ఈ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే.. కాంగ్రెస్ మరింత వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల తరువాత వచ్చే మొదటి ఎన్నికలు కావడంతో.. ఈ ఎన్నికలు అధికార పార్టీ పనితీరు పైనా ప్రభావం చూపనుంది. కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి సుముఖంగా ఉన్న అయన‌ అభ్యర్థిత్వాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీనితో అధిష్టానం ఆచితూచిగా వ్యవహారించనుంది. ఇప్పటికే ముఖ్యనేతల నుండి అధిష్టానం సమాచారం సేకరించినట్టు సమాచారం. ఒకవేళ జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే.. అయన రాజకీయ భవిష్యత్తు కూడా ముగిసినట్టు అంటున్నారు విశ్లేషకులు.

Latest news,Telugu news,Telangana news,Politics news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version