Nsnnews// జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ కొత్త ప్రభుత్వ పాలన దిశగా అడుగులు వేస్తుంది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన 2019 ఏడాది అక్టోబర్ 31న విధించగా.. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎత్తివేశారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్పరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా.. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి పాలన రద్దు చేశారు. ఇందులో భాగంగానే కేంద్రం హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ..గెజిట్ నోటిఫికేషన్‌లో పలు కీలక అంశాలను వెల్లడించారు. 2018లో జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో కూటమి ప్రభుత్వం చీలింది. దీంతో అసెంబ్లీని రద్దు చేసి 6 నెలలపాటు జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31న రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు… జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇదిలా ఉండగా, ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 2009 నుంచి 2014 సమయంలో ఎన్సీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సీఎంగా పనిచేశారు. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి మళ్లీ విజయం సాధించింది. ఈ మేరకు ఎల్‌జీకి ఎన్సీ ఉపాధ్యక్షుడు ఓ లేఖ సమర్పించారు. దీంతో కేంద్రం రాష్ట్రపతి పాలన ఎత్తివేసింది.
Latest news,Telugu news,National news