Nsnnews// లక్నో: జమ్ముకశ్మీర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త మొదటి భార్య కుమారుడు, అతని స్నేహితుడు కలిసి తనను వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అనుభవించిన చిత్రవధను కళ్లకు కట్టినట్టు వివరించింది.
-
ఏం జరిగిందంటే..?
జమ్ముకశ్మీర్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని ఉత్తరప్రదేశ్ ఘజిపూర్ ఇందిరానగర్‌కు చెందిన మహిళ 2020లో వివాహం చేసుకుంది. ఆ అధికారికి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల వరకు బానే ఉన్న తర్వాత టార్చర్ మొదలైందని చెబుతున్నారు. భర్త మొదటి భార్య కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేకపోయానని వివరించారు. కట్నం తీసుకొని రావాలనే హరాస్ చేశారని నిట్టూర్చారు. కశ్మీర్‌లో జరిగిన ఓ ఘటన గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
-
గదిలో బంధించి..
కశ్మీర్‌లో ఉన్న సమయంలో వేధింపులు శృతి మించాయని వివరించారు. నాలుగు రోజులు బంధించారని బాధ పడ్డారు. ఆకలితో అలమటించానని స్పష్టం చేశారు. తన భర్త మొదటి భార్య కుమారుడు తన మొబైల్ తీసుకున్నాడని ఆరోపించారు. తర్వాత అతని ఫ్రెండ్‌తో కలిసి తనపై లైంగికదాడి చేశారని వివరించారు. వదిలేయాలని బతిమిలాడగా వదిలిపెట్టారని గుర్తుచేశారు.
Latestnews, Telugunews, Lucknow, Jammu Kashmir…