Nsnnews// రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల మరణించిన.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్.. సమ్మిరెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో వున్న BRS చేయలేని రుణమాఫీని తొమ్మిది నెలల్లో చేశామన్నారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. త్వరలోనే రుణమాఫీ సొమ్ము వారి ఖాతాల్లో జమచేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Latest news,Telugu news,Telangana news