Home అంతర్జాతీయం జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు.. నిందించుకొంటున్న రష్యా, ఉక్రెయిన్‌ || Massive fire in Zaporizhzhya nuclear power plant.. Russia and Ukraine are being blamed

జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు.. నిందించుకొంటున్న రష్యా, ఉక్రెయిన్‌ || Massive fire in Zaporizhzhya nuclear power plant.. Russia and Ukraine are being blamed

0
జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు.. నిందించుకొంటున్న రష్యా, ఉక్రెయిన్‌ || Massive fire in Zaporizhzhya nuclear power plant.. Russia and Ukraine are being blamed

 

Nsnnews// ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్‌ నియంత్రణ రష్యా అధీనంలో ఉంది. ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని చెబుతోంది. 
ప్రస్తుతం ఆ ప్రదేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్‌ చోటుచేసుకోలేదని చెప్పారు.  మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను వెళ్లనీయాలని కోరారు.  
మరోవైపు ఆ అణువిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన కూలింగ్‌ టవర్‌లో ఆదివారం భారీగా మంటలు చెలరేగాయి. ఈవిషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్‌ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ పేర్కొన్నారు. తమ దళాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా ఆర్పేశాయని వెల్లడించారు. 
2022లో రష్యా దళాలు ఈ అణుకేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నాయి. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. మొత్తం ఆ రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కోల్డ్‌ షట్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా ఈ ప్లాంట్‌ కూలింగ్‌ టవర్‌పై డ్రోన్‌ దాడిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు ఎక్స్‌లో వెల్లడించారు.
Latest news,Telugu news,International News,Ukraine

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here