చెన్నైతో జరిగిన మ్యాచులో పంజాబ్ చాలా ఈజీగా విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన PBKS 13 బంతులు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగురవేసింది. పంజాబ్ బ్యాటర్లలో రోస్సో(46), బెయిర్ స్టో(43) రాణించారు. సామ్ కరన్ (26*), శశాంక్ (25*) జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్, రిచర్డ్, దూబే తలో వికెట్ తీశారు.