Nsnnews// బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ క్రికెటర్లు చెన్నైకి చేరుకుంటున్నారు. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభంకానుంది. రెండో టెస్టుకు కోల్ కతా ఆతిథ్యమివ్వనుంది. బుమ్రా, కేఎల్ రాహుల్ , రిషబ్ పంత్ ముంబై నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వారు బస చేసే హోటల్ కు వెళ్లారు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా లండన్ నుంచి నేరుగా ఇవాళ చెన్నై చేరుకున్నాడు. దాదాపు 18 నెలల తర్వాత సొంత గడ్డపై కోహ్లీ టెస్టు సిరీస్ ఆడనున్నాడు. గతేడాది మార్చిలో చివరిసారిగా ఇక్కడ కోహ్లీ టెస్టు ఆడాడు. బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ లో విరాట్ కోహ్లీ మరో 58 పరుగులు చేస్తే.. అరుదైన ఘనతను సొంతం చేసుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 27వేలకుపైగా పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచే అవకాశం కోహ్లీ ముంగిట ఉంది. టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు.
Latestnews, Telugunews, Bangladesh, Indian Cricketers..