Home చదువు ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

0
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం….

నాటి గురువులతో పూర్వ విద్యార్థులు

 

 

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

NSN న్యూస్ .సిద్ధిపేట రూరల్ 

 

సిద్ధిపేట రూరల్ మండల పరిధిలోని పూల్లూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నందాల వెంకట లక్ష్మి గార్డెన్ లోఆదివారం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 28 సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులుమాట్లాడుతూ 28 సంవత్సరాల తరువాత మమ్మల్ని పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నరు. పాఠశాల గురువులు మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా గత 28 సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్జులందరికీ తమవంతుగా గురువులను గౌరవించి కృతాజ్థాభివందనములు తెలియజేసే బాధ్యత ఉందన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువులను శలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నా3రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here