ఘనంగా ABVP జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు.
NSN NEWS //SIDDIPET// JULY 7 ;
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు స్థానిక వీర సావర్కర్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రాంత ప్రముఖ్ మాసాడి బాబురావు గారు మాట్లాడుతూ”
కేవలం 5 మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన “అఖిల భారతీయ విద్యార్థి పరిషత్” 76వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జ్ఞానం!శీలం!!ఏకత!!!…పరిషత్ ప్రత్యేక..అంటూ క్షణం క్షణం మా కణం కణం… భారతమాతకే సమర్పణం… జనంలోని జ్యోతులం….జాతికొరకు వెలుగుదాం… అంటూ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా, విపత్తులు సంబవించినప్పుడు కూడా ముందుంటూ దేశ పునరనిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ “అఖిల భారతీయ విద్యార్థి పరిషత్”.అలాగే విద్యార్థి పరిషత్ ఆవిర్భావం రోజునే జాతీయ విద్యార్థి దినోత్సవం గా జరుపుకుంటాం. పూర్వ, ప్రస్తుత విద్యార్థి పరిషత్ సభ్యులకు జాతీయవాద విద్యార్థి కుటుంబసభ్యులకు 76వ “అఖిల భారతీయ విద్యార్థి పరిషత్” ఆవిర్భావ దినోత్సవం మరియు “జాతీయ విద్యార్థి దినోత్సవ” శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ బీరకాయల వివేక్ వర్ధన్, మెదక్ సిద్దిపేట జిల్లాల సంఘటన మంత్రి లక్ష్మీపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్ నగర కార్యదర్శి పరశురాం, శంకర్ భీమన్న ప్రవీణ్ రాకేష్ మరియు పూర్వ కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.