Nsnnews// అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రకటించింది. భారతీయ స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగివున్న వినియోగదారులకు.. భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.దీంతో పాటు… ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి ముందస్తుగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను యాక్సెస్ సదుపాయం కలిగిస్తోంది. ఈ ఏడాది సేల్ విక్రయాల్లో భాగంగా కొనుగోలుదారులు.. ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపును పొందేందుకు అవకాశం లభించింది. ఎలక్ట్రానిక్స్ , ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేసింది.అంతేగాకుండా.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మొబైల్‌లు, గేమింగ్ పరికరాలతొ పాటు..ఇతర లైఫ్ స్టైల్ ఉత్పత్తుల వంటి వాటిపై తగ్గింపులను సూచించే ప్రత్యేక మైక్రోసైట్‌ను రూపొందించింది. ఈ క్రమంలో యాపిల్, డెల్, లెనోవో, షావోమి తదితర వస్తువులపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు లభించనున్నాయి. ఇక అమెజాన్ ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ కలిగిన వారు… సెలెక్ట్ చేసుకున్న ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందేందుకు వీలు కల్పించింది అమెజాన్. ఈ సేల్‌లో ట్యాబ్లెట్‌లపై 60 శాతం, సెల్ ఫోన్లు, సంబంధిత యాక్సెసరీలపై 40 శాతం, హెడ్‌ఫోన్‌లపై 70 శాతం, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 60 శాతం, గేమింగ్‌పై 70 శాతం వరకూ డిస్కౌంట్లు పొందవచ్చునని ఆ సంస్థ తెలిపింది.
Latestnews, Telugunews, Amazon Great India Festival….