Nsnnews// 563 పోస్టుల భర్తీ కోసం చేపట్టిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం మినహా … ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఘటనలు జరగలేదని TGPSC పేర్కొంది. జనరల్ ఇంగ్లీష్ పరీక్షకు 22 వేల 744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దాదాపు 72.44 శాతం హాజరైనట్టు తెలిపారు. హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల వద్ద రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన… వరంగల్ కు చెందిన శ్రీలేఖను అధికారులు వెనక్కి పంపడం.. కన్నీటి పర్యంతమయ్యారు. సికింద్రాబాద్ లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి.. గోడదూకేందుకు ప్రయత్నించారు. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల సమీపంలో సాయుధ పోలీసులను మోహరించారు. ఈనెల 27 వరకు జరిగే పరీక్షలను… ఇదే తరహాలో ప్రశాంతంగా జరుపుతామని TGPSC వర్గాలు తెలిపాయి.
latestnews, telugunews, telangananews, group-1….