Home తెలంగాణ గోవధ నిషేధ చట్టాన్ని ప్రతి ముస్లిం తప్పక పాటించాలి…

గోవధ నిషేధ చట్టాన్ని ప్రతి ముస్లిం తప్పక పాటించాలి…

0
గోవధ నిషేధ చట్టాన్ని ప్రతి ముస్లిం తప్పక పాటించాలి…

గోవధ నిషేధ చట్టాన్ని ప్రతి ముస్లిం తప్పక పాటించాలి,..

 

 

 హుజురాబాద్ నియోజకవర్గం జూన్ 13 nsn ప్రతినిధి

 

 కరీంనగర్ ఉమ్మడి జిల్లా మజీద్ అండ్ కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముస్లింలకు విజ్ఞప్తి,గోవధ నిషేధ చట్టాన్ని ప్రతి ప్రతి ముస్లిం తప్పక పాటించాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ అండ్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ముస్లింలకు యావత్తు ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనే మాట్లాడుతూ సమీపంలో ఉన్నందున ముస్లింలు ఖుర్బానీ పేరిట ఆవులను వధ చెయ్యరాదని పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టం -1977, పశువుల పట్ల క్రూరంగా ప్రవర్తన నిషేధిత చట్టం -1960 ప్రకారం ఆవులను అమ్మిన కొనుగోలు చేసిన వారిపై పోలీస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని, ముస్లింలు గోవధ నిషేధ చట్టాన్ని తప్పక పాటించాలని సూచించారు. దేశంలోని చట్టాలను గౌరవిస్తూ దేశ సమైకత్య, సమగ్రత కోసం ఆవులను వధించకూడదని, ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు, నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించకూడదని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు.తేదీ 17-06-2024 సోమవారం రోజున బక్రీద్ పండుగ ఉంది, పవిత్ర బక్రీద్ మాసం రాబోతుందని బక్రీద్ మాసంలో ఖుర్బానీ ( బలి ) ఇచ్చే జంతువులలో ఆవులను వధించకూడదని ఇది చట్ట నిత్య నేరమన్నారు. ఇటువంటి సున్నితమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు,అన్ని మతాల వారికి గౌరవిస్తూ గంగా – జమున తహే జిబ్ మత సామరాన్ని పాటిస్తూ శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here