Nsnnews// సిక్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన.. గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసులో అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపిస్తూ.. పన్నూ దావా వేయడాన్ని వ్యతిరేకించింది. పన్నూ ఒక ఉగ్రవాది అని, అతడి కేసులో తమను ప్రశ్నించడమేంటని తప్పుపట్టింది. ఇది పూర్తిగా అసమంజసమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్…మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసు వెనక ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహించే సంస్థ చట్టవిరుద్ధమైనదనే వాస్తవం…అందరికీ తెలుసని అన్నారు. తమ భూభాగంపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అమెరికా పేర్కొంది. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు భారతీయుడు నిఖిల్ సుపారీ ఇచ్చారని…అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.
Latest news,Telugu news,National news,International news