Nsnnews// గత పదేళ్లలో రాష్ట్రంలో క్రీడాశాఖ నిద్రావస్తలోకి వెళ్ళిందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివ సేనారెడ్డి అన్నారు. బధిరుల ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్ ను ఆయన అభినందించారు. గత ప్రభుత్వం క్రీడాకారులని పట్టించుకోలేదని విమర్శించారు. CM రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న ఆయన.. మరో ఆరు నెలల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతి క్రీడాకారుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికో క్రీడాపాఠశాలను ఏర్పాటు చేస్తామని శివసేనారెడ్డి పునరుద్ఘాటించారు.
Latestnews,telugunews, Shivasenareddy,CM Revanth Reddy, Sports Authority…