Home తెలంగాణ గత ప్రధానుల కంటే మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి || Modi took twice as much debt as previous prime ministers: CM Revanth Reddy

గత ప్రధానుల కంటే మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి || Modi took twice as much debt as previous prime ministers: CM Revanth Reddy

0
గత ప్రధానుల కంటే మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి || Modi took twice as much debt as previous prime ministers: CM Revanth Reddy

 

Nsnnews// హైదరాబాద్‌: అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్‌ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘‘దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయి. 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారు. మోదీ తన పరివారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 
దేశాన్ని మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ చెరబట్టారు. సెబీ ఛైర్‌పర్సన్‌ అక్రమాలపై విచారణ జరపాలి. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ. ఇందిరా గాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,BJP,Congress,PM Modi,Revanth Reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here