Nsnnews// ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రవాణా మంత్రి పొన్నంప్రభాకర్ తెలిపారు. ఈ నెల 17న పెద్దఎత్తున జరిగే గణపతి నిమజ్జనోత్సవానికి….. ఇప్పటికే అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధంచేసినట్టు పొన్నం చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని…. హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ప్రయత్నించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు వెల్లడించారు. 25వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతిని 17వతేదీ మధ్యాహ్నం 2లోపు నిమజ్జనంచేయాలని నిర్వాహకులని కోరామని అందుకు వారు అంగీకరించినట్టు సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Latestnews, Telugunews, Ganesh Nimarjanam 2024, Ponnam Prabhakar…