Nsnnews// క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది.. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నా.. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ లో ప్రారంభించబోతున్నాం. అంతర్జాతీయ స్ధాయి కోచ్ లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తాం.. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపాం. దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం.
Latest news,Telugu news,Telangana news,Sports news