Nsnnews// గత పదేళ్లలో అనేక ప్రభుత్వ పథకాలకు తిలోదకాలు ఇచ్చిన BRS..ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినప్పటికీ…వారు బాకీపెట్టిన 7వేల 600 కోట్లు రైతుబంధు డబ్బులను చెల్లించామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే వడగళ్ల వానకు మార్చిలో 15 కోట్లు, ఆగస్టు వరదలకు 79 కోట్లు రైతులకు చెల్లించిన కాంగ్రెస్ సర్కార్ ను విమర్శించే హక్కు BRSకు లేదన్నారు. రాష్ట్ర వాటా విడుదల చేయకుండా 2వేల 500 కోట్ల కేంద్ర నిధులు రాకుండా చేసి.. రైతుల సంక్షోబానికి కారణమయ్యారని మండిపడ్డారు. రుణమాఫీ కోసం 2014 లో నాలుగు వాయిదాలు పెట్టి, 2018 లో చివరి సంవత్సరం సగం మందికే BRS సర్కార్ చెల్లించిందన్నారు. గత ప్రభుత్వం వదిలేసిన రైతులందరికి మరో లక్ష కలిపి మొదటి పంట కాలంలోపే.. రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతు బంధు పేరు చెప్పి BRS సర్కార్ ఎగ్గొట్టిన ప్రతి పథకాన్ని.. ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తున్నామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
Latest news,Telugu news,Telangana news