Home అంతర్జాతీయం క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా కవ్వింపు || North Korea provocation with missile tests

క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా కవ్వింపు || North Korea provocation with missile tests

0
క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా కవ్వింపు || North Korea provocation with missile tests

 

Nsnnews// శత్రు దేశాలను క్షిపణి పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా… మరో ఆయుధాన్ని పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలను పేల్చేందుకు రూపొందించిన పేలుడు డ్రోన్ లను ప్రయోగించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ పరీక్షను దగ్గరుండి పర్యవేక్షించారు. డ్రోన్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఉత్తర కొరియా అధికారిక మీడియా-KCNA విడుదల చేసింది. తెల్ల రంగులో ఎక్స్ ఆకారపు తోకలున్న..ఓ డ్రోన్ దక్షిణ కొరియా K-2 ప్రధాన యుద్ధ ట్యాంక్ ను పోలి ఉండే లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నట్టు KCNA చిత్రాల్లో ఉంది. యుద్ధ సంసిద్ధత కోసం మిలిటరీకి అలాంటి ఆయుధాలను… అభివృద్ధి చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్టు KCNA పేర్కొంది.

Latest news,Telugu news,International news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here