Nsnnews// కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు.. సంజయ్ రాయ్‌పై ప్రత్యేక కోర్టులో CBI ఛార్జిషీట్ దాఖలు చేసింది. RG కర్ ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో వైద్యురాలు నిద్రిస్తున్న సమయంలో… ఆగస్టు 9వ తేదీన నిందితుడు సంజయ్ రాయ్…హత్యాచారానికి పాల్పడినట్టు అభియోగపత్రంలో CBI పేర్కొంది. సామూహిక అత్యాచారానికి సంబంధించి ఆరోపణలు రాగా…ఆ విషయాన్ని ఛార్జిషీట్‌లో CBI ప్రస్తావించలేదు. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఛార్జిషీట్ లో CBI పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని CBI వెల్లడించింది.
Latest news,Telugu news,National news