Nsnnews// అమెరికా కొలరాడో రాష్ట్రంలోని ఒకప్పుడు గోల్డ్ మైనింగ్ కు ప్రసిద్ధి గాంచిన.. లీడ్ విల్ నగరంలోని మట్టిలో మిగిలిపోయిన విలువైన ధాతువులను.. వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శతాబ్ధానికి పైగా ఇక్కడి మట్టి నుంచి బంగారం, వెండిని సంప్రదాయ పద్దతుల్లో వెలికితీసి ప్రాసెస్ చేసేవారు. ఈ క్రమంలో వెలువడ్డ లోహపు వ్యర్థాలతో నగరం కాలుష్యకాసారంగా మారింది. ఆర్కానాస్ నదిలోని నీరు ఆరంజ్ , బ్రౌన్ రంగులోకి మారి విషంగా తయారైంది. మైనింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడి పరిసరాలను ఖాళీ చేయడంతో లోహపు వ్యర్థాలు మిగిలిపోయాయి. ఆ వ్యర్థాల నుంచి విలువైన ఖనిజాల్ని సేకరించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో స్థానికంగా ప్రజలు మళ్లీ కలవరపాటుకు గురవుతున్నారు. 20ఏళ్ల క్రితం ఇక్కడి నదిలో చేపలు కూడా బతకలేని స్థితిలో ఉండేదని, మళ్లీ ఇప్పుడు మైనింగ్ తో సీసెం, ఆర్సెనిక్ , జింక్ వంటి విషపూరిత లోహాలు.. భూగర్భజలాలు, మట్టి కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Latestnews, Telugunews, America, Colorado Gold Mining..