Nsnnews// కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు గత ప్రభుత్వం పెట్టిన డాక్టర్ YSR పేరును తొలగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2023-24లో ప్రారంభమైన 5, 2024-25 ప్రారంభించాలని… నిర్ణయించిన మరో 5 వైద్య కళాశాలలకు డాక్టర్ YSR పేరు పెడుతూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇకపై..రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్టణం, నంద్యాలలోని వైద్య కళాశాలలకు… ఆ ప్రాంత పేరు కలిపి ప్రభుత్వ వైద్య కళాశాలగా వ్యవహరిస్తారు. పలాసలోని కిడ్నీ రీసెర్చిసెంటర్ అండ్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ ఆసుపత్రికి పెట్టిన డాక్టర్ YSR పేరును కూడా తొలగిస్తూ… వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై వీటిని ప్రభుత్వ కిడ్నీ రీసెర్చి సెంటర్, క్యాన్సర్ సెంటర్లగా వ్యవహరిస్తారు.
Latest news,Telugu news,Andhra pradesh news