Nsnnews// ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక మున్సిపాలీటీలో అవినీతిని పెంచి పోషిస్తున్నారని..సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్‌లు ఆరోపించారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. బతుకమ్మ సంబరాలు, హరితహారం పేరుతో..మున్సిపల్ చైర్మెన్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన కొత్త ప్రభాకర్ రెడ్డి…కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేదనడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఎమ్మెల్యే చేసే వాఖ్యలు..దయ్యాలు వల్లించే వేదాల వలే ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకు దుబ్బాక మున్సిపాలిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే… అవినీతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో.. కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు మల్లుగారి చంద్రారెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉశయ్యగారి రాజిరెడ్డి, మున్సిపాలిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. కర్ణంపల్లి రమేష్ గౌడ్,తోట్ల చంద్రంలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Politics news