Nsnnews// తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ లో తన కుమారుడి జన్మదినోత్సవం జరుపుకున్నానంటూ..వైసీపీ విష ప్రచారం చేయడం దారుణమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండిపడ్డారు. విజయవాడలోని తన ఇంట్లో జరిగిన పుట్టినరోజుపై రాద్దాంతం తగదని హితవు పలికారు. తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేశ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఏడుకొండలపై విష రాజకీయాలు చేయొద్దని జగన్ ను హెచ్చరించారు. ఫేక్ జగన్ మారడని,.. అతని ఫేక్ మూకలు అస్సలు మారడంలేదని ధ్వజమెత్తారు. ఫేక్ చేసి చేసి 151 నుంచి 11కి వచ్చిన జగన్ ఇలాగే కొనసాగిస్తే ఒక్క సీటు కూడా లేకుండా పోతారని హెచ్చరించారు.
Latest news,Telugu news,Andhra pradesh news