Nsnnews// రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో దారుణం జరిగింది. వీధి కుకల దాడిలో 30 గొర్రెలు మృతి చెందగా..చాలా గొర్రెలు గాయపడ్డాయి. మండల కేంద్రంలో ఎల్లంపల్లి శ్రీశైలం అనే రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకంతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే గొర్రెలను మేత కోసం తీసుకెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కొట్టంలొ ఉంచి ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో కుక్కలు గొర్రెల మందలోకి చొరబడి సుమారు 30 గొర్రెలపై దాడి చేసి చంపేశాయి. తెల్లారుజామున గొర్రెలను కుక్కలు లాక్కొని తీసుకెళ్లడాన్ని గమనించిన రైతు శ్రీశైలం వాటి నుంచి విడిపించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చాలా గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. దాదాపు 3 లక్షల వరకు నష్టపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
Latestnews, Telugunews, Rangareddy District, Stray Dogs , Attack, Sheeps…