Home క్రైమ్ కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ఐ

కేసు పక్కన పెట్టి మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ఐ

0
కేసు పక్కన పెట్టి మందు బాబులతో  కలిసి చిందులేసిన ఒంగోలు ఎస్ఐ

 

Nsnnews//AP  ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏఎస్సైను వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది.

Latest news,Telugu news,Crime…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here