Home జాతీయం కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారు…..

కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారు…..

0
కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారు…..

కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట 

NSN NEWS//SIDDIPET MAY 1:-

2024 సంవత్సరం కేదార్నాథ్ యాత్రికుల కోసం సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి వారి ఆధ్వర్యంలో కేదార్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం సోన్ ప్రయాగ్ పార్కింగ్ ప్రాంగణము లో మరియు కేదార్నాథ్ గుడి దగ్గర భైరవ స్వామి దేవాలయం దారిలో రెండు చోట్ల ఉచితముగా అన్నప్రసాద వితరణ చేయుటకు సరుకుల లారీ పంపుటకు ఏర్పాట్లు చేసి తేదీ 03-05-2024 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు శ్రీ శరభేశ్వర స్వామి దేవాలయంలో శివ కళ్యాణం నిర్వహించి సరుకుల లారీకి పూజలు చేసి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా సమితి గౌరవ సభ్యుల అతిధుల బంధుమిత్రుల పత్రిక మరియు మీడియా మిత్రుల సమక్షంలో లారీని సోన్ ప్రయాగ బేస్ క్యాంపుకు పంపబడును కార్యక్రమానంతరం అక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేయడమైనది.

ఈ సందర్భంగా అధ్యక్షులు చీకోటి మధుసూదన్ మాట్లాడుతూ ఎముకలు కొరికే చలిలో దక్షిణ భారతదేశం నుండి వచ్చే భక్తులు తెలుగువారి బోజనము దొరకని చోట ఇంటి భోజనంలా తయారుచేసి వచ్చిన భక్తులు అందించాలని ఒక సంకల్పంతో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేసి ఈ సంవత్సరం నాలుగు వ సారి భక్తులకు అన్న ప్రసాదం చేయడానికి సర్వం సిద్ధం చేసింది గతంలో సోన్ ప్రయాగ్ లో మాత్రం పెట్టేవారమని ప్రస్తుత సంవత్సరం కేదార్నాథ్ దేవాలయం దగ్గరలో కూడా భక్తుల సౌకర్యార్థం ఆ కేదారేశ్వరుని చెంత కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేశామని ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుని అక్కడికి వచ్చిన వారందరూ మా భోజనాన్ని స్వీకరించి తృప్తి చెందాలని మా కోరిక కావున ఇట్టి అవకాశాన్ని తెలిసినవారు మిగతా వారికి తెలియజేసి ఈ యొక్క గొప్ప సేవను ప్రచురించడం చేసి కేదార్నాథ్ యాత్రకు వచ్చిన భక్తులు వినియోగించుకునే విధంగా మీరు కూడా సహకారం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇట్టి కార్యక్రమం సమితి గౌరవ సభ్యుల మరియు బంధుమిత్రుల సహకారంతో విరాళాలు సేకరించి నిర్వహిస్తున్నాం అని ఈ సంవత్సరం మే 10వ తారీఖు నుండి భక్తులకు అన్నప్రసాదం అందుబాటులో ఉండును అని గర్వంగా తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చీకోటి మధుసూదన్, ప్రధాన కార్యదర్శి అయిత రత్నాకర్, కోశాధికారి గోపిశెట్టి శరభయ్య, పీఆర్వో మాంకాల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు కాచం కాశీనాథ్, గంజి రాములు, నందిని శ్రీనివాస్, సభ్యులు చీకోటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here