Nsnnews// వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ సిబ్బంది దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఆరో వార్డులో ఏర్పాటు చేసి కుక్కల నియంత్రణ కేంద్రంను మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం కుక్కల ఆపరేషన్ చేసే విధానం గూర్చి పశుసంవర్ధక శాఖ అధికారులు ఆమెకు వివరించారు. అలాగే వనమహెత్సవంలో భాగంగా ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వీధి కుక్కలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి పట్టణంలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించినట్టు తెలిపారు. కుక్కల బెడద ఉందని సమాచారమిస్తే.. వాటిని పట్టుకుని ప్రత్యేక వాహనంలో కేంద్రానికి తరలిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జగత్ కుమార్ రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రేరణ, పశు వైద్యాధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news