Nsnnews// తలసేమియాతో బాధపడే చిన్నారులకు..రక్తదానం చేసి, ప్రాణాలు కాపాడాలని…కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం హిందుప్రియ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో… ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రక్తదానం చేసేందుకు వచ్చే దాతలను…ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ రానున్నట్టు ఇందుప్రియ తెలిపారు. కార్యక్రమంలో… ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్,ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్‌లతో పాటు..,ఉపాధ్యక్షులు జమీల్ హైమద్, డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్, వెంకటరమణలు, SRK డిగ్రీ,పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి, రాజులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy news