Nsnnews// కాంగ్రెస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని.. సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చిన్నగుండవెల్లి ఎస్సీ కాలనీలో బోరు బావి డ్రిల్లింగ్ పనులను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామంలో 30 లక్షలతో సిసి రోడ్డు నిర్మించామన్న ఆయన.. రెడ్డి కమ్యూనిటి నిర్మాణానికి పది లక్షలు మంజూరు చేసి, పనులు ప్రారంభించినట్టు చెప్పారు. నీటి కొరతతో మహిళలు ఇబ్బందులకు గురి కావద్దనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్, సీనియర్ నాయకులు కాలీముద్దీన్, బొమ్మల యాదగిరి, జిల్లా మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి,పూజల గోపి కృష్ణ.నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Politics news,Siddipet news