Nsnnews// హైదరాబాద్ సిటీ మణికొండలోని టాప్ బిర్యానీ రెస్టారెంట్ ఔట్ లెట్ నుంచి జిలానీ అనే కస్టమర్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన 20 నిమిషాల్లోనే వేడివేడిగా చికెన్ బిర్యానీ ఇంటికి వచ్చింది. ఓపెన్ చేసి సగం తినేశాడు.. ఆ తర్వాత బిర్యానీలోని ప్లాస్టిక్ కవర్ బయటపడింది. బాగా డీప్ ఫ్రై అయిన ప్లాస్టిక్ కవర్ అది.. బిర్యానీలో ఉంది. చాలా పెద్ద ప్లాస్టిక్ కవర్ అది. షాక్ అయిన కస్టమర్ జిలానీ వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయటంతోపాటు జీహెచ్ఎంసీకి, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ట్యాగ్ చేశాడు.
Latestnews, Telugunews, Hyderabad, Restaurant outlet…