Nsnnews// సీనియర్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా క్యాడర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక కార్యదర్శిగా పాండే నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.
Latest news,Telugu news,National news,Business news