Nsnnews// భూమి, భుక్తి కోసం పోరాడిన మహాశక్తి..చాకలి ఐలమ్మ అని..కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా..రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని విగ్రహానికి..అధికారులతో కలిసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు..ఆర్డీఓ రంగనాథ్, మున్సిపల్ కమీషనర్ సుజాత, డీఎస్పీ నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy news