Nsnnews// యాపిల్ కొత్త ప్రొడక్టుల రాకపై టెక్ ప్రియుల ఆసక్తి ఇంతా అంతా కాదు. ఆ వస్తువులు కొన్నా, కొనకపోయినా వాటి ధరలు, ఫీచర్లు తెలుసుకోవడానికైనా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అందుకే ఏడాదికోసారి యాపిల్ నిర్వహించే ఈవెంట్‌కు అంతటి క్రేజ్. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా యాపిల్ తన 16 సిరీస్ ఫోన్లను తీసుకురాబోతోంది. త్వరలోనే వీటిని లాంచ్ చేయనుంది. అధికారిక తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.
అయితే, యాపిల్ ఇంకా ఈవెంట్ తేదీ ఖరారు చేనప్పటికీ.. సెప్టెంబర్ 10వ తేదీన ఈవెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న కాలిఫోర్నియా వేదికగా ఈవెంట్ నిర్వహించగా.. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 7న ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈ సారి సెప్టెంబర్ 10న ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20 నుంచి కొత్తగా లాంచ్ చేసిన ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి ఇప్పటికే ఇన్విటేషన్లు పంపించినట్లు సమాచారం.
రాబోయేవి ఇవేనా..?
యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి కూడా నాలుగు ఫోన్లు రాబోతున్నాయి. స్టాండర్డ్ వేరియంట్‌తో పాటు ఐఫోన్ 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను యాపిల్ తీసుకురాబోతోంది. యాపిల్ ఏ18 ప్రో చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. నాలుగు ఫోన్లూ వేర్వేరు సైజుల్లో, వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో లభించనున్నాయి. ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4నీ లాంచ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Latest news,Telugu news,Business news