Home బ్రేకింగ్ ఐఫా వేడుకలో తళుక్కుమన్న జాన్వీ || Janhvi Kapoor at IIFA Awards 2024

ఐఫా వేడుకలో తళుక్కుమన్న జాన్వీ || Janhvi Kapoor at IIFA Awards 2024

0
ఐఫా వేడుకలో తళుక్కుమన్న జాన్వీ || Janhvi Kapoor at IIFA Awards 2024

 

Nsnnews// ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం అబుదాబి వేదికగా కన్నుల పండువగా జరిగింది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేడుక ముగిసింది.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ పరిశ్రమల నుంచి ఎందరో నటీనటులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఇటీవలే దేవర సినిమాలో నటించిన జాన్వీ కపూర్ కూడా ఐఫా వేడుకల్లో మెరిసింది. ఈవెంట్ కోసం జాన్వీ గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ గౌను ధరించింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది. సింపుల్ మేకప్‌నకు తోడు లూజ్ హెయిర్ జాన్వీని మరింత అందంగా మార్చేసింది. కాగా ఐఫా ఈవెంట్‌లో జాన్వీ లుక్స్‌తో పాటు ఆమె ధరించిన నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. మీడియా కథనాల ప్రకారం జాన్వీ కపూర్ ధరించిన నెక్లెస్ విలువ దాదాపు 8కోట్లని తెలుస్తోంది. జాన్వీ కపూర్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సింపుల్‌గా ఉన్నప్పటికీ ఇన్ని కోట్లా? అని నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న జాన్వీ ఇప్పుడు దేవరతో తెలుగు ఆడియెన్స్ కు కూడా చేరువైంది. అయితే ఇందులో ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దేవర పార్ట్-2లో జాన్వీ పాత్ర మరింత కీలకం కానుందని తెలుస్తోంది. కాగా దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ 5కోట్లు తీసుకుందని సమాచారం. దీంతో పాటు రామ్ చరణ్ ఆర్‌సీ-16 సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది జాన్వీ. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమలో లాంఛనంగ ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది.

Latest news,Telugu news,cinema news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version