Nsnnews// మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను… సంబంధిత అధికారులు, ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సన్మానించారు. గత ప్రభుత్వ హయాంలో.. రైతులు ధర్నాలు చేసేంత వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేవి కాదన్నారు. తమ ప్రజా ప్రభుత్వ పాలనలో..రైతులకు ఇబ్బందులు కల్గించకుండా ఉండేదుకు..ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 473 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనట్టు తెలిపారు. రైతులు పండించిన ఏ గ్రేడ్ రకం ధాన్యానికి 2320, బీ గ్రేడ్ రకానికి 2300 రూపాయలు మద్దతు ధర ఇస్తుందని పేర్కొన్నారు. అంతకముందుకు…శేరిపల్లికి చెందిన శ్రీరామ్ కృష్ణకు…60 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కుఅందించారు.
Latest news,Telugu news,Telanagana news,Medak District