Home తెలంగాణ ఏబీవీపీ విద్యార్థి సంఘమే నెంబర్ వన్ || ABVP student union is number one

ఏబీవీపీ విద్యార్థి సంఘమే నెంబర్ వన్ || ABVP student union is number one

0

 

Nsnnews// సిద్దిపేట: నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు ఏర్పాటు చేసిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇవాళ్టీతో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. abvp ఆవిర్భావ వేడుకలను ఆ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలో abvp జిల్లా కన్వీనర్ వివేక్‌తో పాటు, విద్యార్థి సంఘం నాయకులు…స్థానిక కంచరా బజార్ చౌరస్తాలో 75వ ఆవిర్భావ వేడుకలను పలు పాఠాశాలల విద్యార్థులతో కలిసి నిర్వహించారు.విద్యార్థి సంఘం నాయకులు..abvp పతకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు కాషాయపు జెండాలతో, విద్యార్థులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. దేశ పున:నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడ్డ ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని పేర్కొన్నారు. 5గురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ, ప్రస్తుతం 58లక్షల విద్యార్థుల సభ్యత్వంతో దేశంలో నెంబర్ వన్ విద్యార్థి సంఘంగా ఎదిగిందన్నారు. జాతీయ పతాకం ఎగరకుండా అడ్డుపడిన నక్సలైట్ల మూకలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయింది కేవలం abvp విద్యార్థి నాయకులేనని వారి సేవాలను కొనియాడారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version