Home బ్రేకింగ్ ఏపీ ఎక్సైజ్‌కు దరఖాస్తుల వెల్లువ || Huge Applications For Liquor Shops

ఏపీ ఎక్సైజ్‌కు దరఖాస్తుల వెల్లువ || Huge Applications For Liquor Shops

0
ఏపీ ఎక్సైజ్‌కు దరఖాస్తుల వెల్లువ || Huge Applications For Liquor Shops

 

Nsnnews// ఆంధ్రప్రదేశ్​లో మద్యం దుకాణాల కోసం.. సోమవారం రాత్రి 9 గంటల వరకూ 20,310 దరఖాస్తులు అందాయి. ఒక్క రోజు వ్యవధిలో ఈ దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి ఆరు చొప్పున అర్జీలు వచ్చాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో.. సర్కార్​కి 406.20 కోట్ల ఆదాయం సమకూరింది.

మద్యం దుకాణాల టెండర్‌కు …రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. దీంతో ఇవాళ, రేపు వేల సంఖ్యలో అర్జీలు వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు చేసుకునేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారని వారు పేర్కొన్నారు. మరోవైపు విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేశారు. వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 1,689 అర్జీలు పడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 దుకాణాలకు 1,519 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరులో 144 దుకాణాలకు గాను 1,488 అర్జీలు అందాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 175 దుకాణాలకు 1,127, శ్రీకాకుళంలో 158 దుకాణాలకు1,003 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారు.. ఆఫ్‌లైన్‌ విధానంలో నాన్‌ రీఫండ్‌బుల్‌ రుసుములు చెల్లించేందుకు ఏపీ సర్కార్ పలు వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా 2 లక్షల దరఖాస్తు రుసుముకు సంబంధించి.. దేశంలోని ఏ వాణిజ్య బ్యాంకులో తీసిన డిమాండ్‌ డ్రాఫ్ట్‌ నైనా అంగీకరిస్తామని తెలిపింది. గ్రామీణ బ్యాంకుల్లో డీడీలు తీస్తే మాత్రం.. అవి రాష్ట్ర పరిధిలోని బ్యాంకులే అయి ఉండాలని స్పష్టం చేసింది.

సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి కూడా చలానా తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ చలానాలు, డీడీల ఒరిజినల్‌ను సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. పూర్తిగా ఆఫ్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఎక్సైజ్‌ స్టేషన్‌లలో సంప్రదించాలని తెలిపింది. అక్కడ చలానా లేదా డీడీ సమర్పించాలని వివరించింది. ఈ మేరకు ఇటీవల తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో స్వల్ప సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా జారీ చేశారు.

Latest news,Telugu news, Andhra Pradesh news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version