Nsnnews// ఆసియాలో శక్తివంతమైన దేశాల ర్యాంక్‌లను..సిడ్నీకి చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్..ఏషియా పవర్ ఇండెక్స్ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో జపాన్‌ను దాటేసి భారత్ మూడో ర్యాంకును సాధించింది.
ఏషియా పవర్ ఇండెక్స్ నివేదికలో..మొదటి స్థానంలో నిలిచిన అమెరికాకు 81.7 పాయింట్ల స్కోర్ రాగా, రెండో స్థానంలో నిలిచిన చైనాకు 72.7 పాయింట్లు దక్కింంచుకుంది. ఇక..మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు 39.1 పాయింట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో నిలిచిన జపాన్‌కు 38.9 పాయింట్లు, ఐదో స్థానంలోని ఆస్ట్రేలియాకు 31.9 పాయింట్లు, ఆరో స్థానంలోని రష్యాకు 31.1 పాయింట్లు వచ్చాయి. ఈ జాబితాలో మొత్తం 27 దేశాలకు చోటు దక్కింది. ఆర్థిక వికాసం, భవిష్యత్ పురోగతి అవకాశాలు, దౌత్యపరమైన ప్రభావశీలతలు అనేవి.. భారత్ ర్యాంకింగ్ పెరగడానికి దోహదం చేశాయని నివేదిక వెల్లడించింది. చైనా, జపాన్‌లలో యువత జనాభా తక్కువగా ఉండగా.. భారత్‌లో ప్రస్తుతం పెద్దసంఖ్యలో యువత జనాభా ఉండటం కలిసొచ్చే అంశమని పరిశీలకులు అంటున్నారు. మనదేశానికి ఈ జాబితాలో మూడో ర్యాంకు వచ్చిన విషయాన్ని.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Latest news,Telugu news,National news