Home బ్రేకింగ్ ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు పరిమితి దాటితే…బాదుడే…

ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు పరిమితి దాటితే…బాదుడే…

0
ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు పరిమితి దాటితే…బాదుడే…

 

Nsnnews// క్యాష్ విత్‌డ్రాపై కస్టమర్లు చెల్లించే ఇంటర్‌ఛేంజ్ ఫీజును పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)లను సంప్రదించారు. ఇప్పటికే ఉన్న ఛార్జీలకు మరో రెండు రూపాయలు పెంచాలని కోరింది. వ్యాపారం కోసం మరిన్ని నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) ఇంటర్‌చేంజ్ ఫీజును ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 23కి పెంచాలని పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం ఇంటర్‌చేంజ్ రేటును చివరిసారిగా పెంచినట్లు ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ వెల్లడించారు.

2021లో ఏటీఎం లావాదేవీలపై ఇంటర్‌చేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కి పెంచారు. ప్రస్తుతం ఈ ఫీజు రూ. 21గా ఉంది. ఏటీఎం ఆపరేటర్ల కోరిక మేరకు ఆర్‌బీఐ మరో రెండు రూపాయలు పెంచడానికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. అది రూ. 23లకు చేరుతుంది. ఏటీఎం చార్జెస్ అనేవి లిమిట్ దాటితే వర్తిస్తాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఏటీఎం నుంచి నెలకు ఐదు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి ఆరు ప్రధాన నగరాల్లో బ్యాంకులు తమ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు కనీసం ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ లిమిట్ దాటిన తరువాత ఈ చార్జెస్ వర్తిస్తాయి.

Latestnews, Telugunews, ATM…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here