Delhi:
ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల సంపదను స్వాధీనం చేసుకునే రీతిలో అంశాలు ఉన్నాయని బీజేపీ ఆందోళన చేపట్టింది. దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరిగేందుకు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం తెరపైకి వచ్చింది.
ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల సంపదను స్వాధీనం చేసుకునే రీతిలో అంశాలు ఉన్నాయని బీజేపీ ఆందోళన చేపట్టింది. దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ జరిగేందుకు సర్వం సిద్దమైంది. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం తెరపైకి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను నిరసిస్తూ, బిజెపి ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బుధవారం కాంగ్రెస్ అక్బర్ రోడ్ కార్యాలయం బయట నిరసన ప్రదర్శన చేపట్టారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ సంస్కృతిని అవమానించేలా ఉందని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే మంగళసూత్రాలు లాక్కుంటారని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బారికేడ్లు తొలగించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. బారికేడ్లు తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఏఐసీసీ కార్యాలయం ముందు బైఠాయించేందుకు బీజేపీ సీనియర్ నేత తరుణ్‌చుగ్ ప్రయత్నించారు. అయితే ఆయన్ను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. మహిళల బంగారాన్ని బలవంతంగా లాక్కునేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు తరుణ్‌చుగ్.