Nsnnews// ముంబయి: ఎస్‌ఎమ్‌ఈ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన కంపెనీల ఖాతాలను ఆడిట్ చేసే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చార్టర్డ్ అకౌంటెంట్ల(సీఏ)కు సెబీ పూర్తికాల సభ్యుడు అశ్వినీ భాటియా సూచించారు. శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘నమోదిత చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎస్‌ఎమ్‌ఈ)ల ఖాతాలను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇవే ప్రధాన కంపెనీలుగా వృద్ధి చెందుతాయ’ని అన్నారు. ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫాంలో కొన్ని సవాళ్లు ఉన్నాయి. అందువల్ల ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల’ని సీఏలకు సూచించారు. ఎస్‌ఎమ్‌ఈ ప్లాట్‌ఫాం ప్రగతి విషయంలో భాటియా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా రూ.14,000 కోట్లను కంపెనీలు సమీకరించాయని.. 2023-24లోనే రూ.6,000 కోట్ల నిధులను పొందాయని వివరించారు.
Latest news,Telugu news,Business news