Nsnnews// పోసానిపేట్ గ్రామంలో గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ మహనీయులైనటువంటి గౌతమ్ బుద్ధుడు. జ్యోతిరావు పూలే. సావిత్రిబాయి పూలే విగ్రహాలను నా చేతుల మీద ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహనీయుల యొక్క విగ్రహాల కొరకు దాతలుగా ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. గౌతమ బుద్ధుడు చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే, జ్యోతిరావు పూలే బీసీలను ఐక్యం చేసిన చరిత్ర మనందరికీ తెలుసు అని, సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. అలాంటి వారి అడుగు జడలు మనం నడవాలని కోరారు. ముఖ్యంగా చెప్పాలంటే పాఠశాల ముందు ఇలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Telangananews, kamareddy district…