Nsnnews// దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించేందుకు వచ్చిన కొత్త ప్రభాకర్ రెడ్డిని…కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోలింగ్ చేయడంలో..ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపిస్తూ.., కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కాన్వయ్‌పై కోడిగుడ్లతో దాడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు…కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆందోళన కారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటీకి ఎవరూ వినకపోవడంతో…నిరసనకారులను పక్కకు తప్పించి..ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కాన్వయ్ సంఘటన స్థలం నుంచి పంపించి వేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకున్నాయి. దీంతో..ఇరు వర్గాల ఆందోళనతో..దుబ్బాకలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసకున్నాయి.
Latest news,Telugu news,Telangana news