Nsnnews// తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న…దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పోలీసుల తీరును ఎమ్మెల్యే ఖండించారు. రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలా లేదన్న ఆయన…పోలీసుల అత్యుత్సాహం చూస్తే ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసుల పాలన నడుస్తుందని విమర్శించారు. హౌస్ అరెస్టు పేరుతో ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం..పోలీసు బలగాలు, నిర్భంధాలతో ప్రజా ఆగ్రహ ఉద్యమాలు అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Latest news,Telugu news,Telangana news,politics