Nsnnews// ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో… వాస్తవాలకంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. N కన్వెన్షన్‌ను నిర్మించిన స్థలం పట్టా కలిగిన డాక్యుమెంటెడ్ భూమి అని స్పష్టం చేశారు. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించిందికాదని తెలిపారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని.. స్పెషల్ కోర్టు, AP లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒక ఆర్డర్ ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందని నాగార్జున వివరించారు. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం…. హైకోర్టుని ఆశ్రయించామని.. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటానని.. అభిమానులు, శ్రేయోభిలాషులకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి వరకు ఊహాగానాలు ఎలాంటి పుకార్లు అవాస్తవాలు నమ్మవద్దని.. సవినయంగా అభ్యర్ధిస్తున్నానని తెలిపారు.
Latestnews, Telugunews, Akkineni Nagarjuna, N Convention..