Nsnnews// విజయవాడ: వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ప్రతి దారుడు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మూడు పార్టీల కలయిక వల్లే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మాకు ప్రజలు 40 శాతం మద్దతు తెలిపారన్నారు. దాడులు ఆపకపోతే ప్రతి దాడులకు దిగుతామని.. సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. మాది మాస్ పార్టీ అని.. మీది క్లాస్ పార్టీ అని పేర్కొన్నారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయనంత అభివృద్ధిని జగ్గయ్యపేట నియోజకవర్గంలో చేసిన ప్రజలు తిరస్కారానికి గురవటంపై ఆశ్చర్యంగా ఉందని ఉదయభాను పేర్కొన్నారు.
Latestnews, Telugunews, Vijaywada, YCP, Samineni…